మందస లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ విధానంలో ఓటింగ్ పూర్తిచేసుకుని బయటకు వచ్చిన బిట్స్ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు బాబ్స్ సార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ప్రజలు ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని, మంచి సమాజం నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయడానికి అర్హత పొందిన ప్రతీ వ్యక్తీ, అది తమకు చాలా గర్వకారణ మైన విషయంగా భావించాలని అన్నారు. ఓటు హక్కు పొందిన ప్రతీ వ్యక్తీ చాలా శక్తివంతంగా మరియు బాధ్యతగా భావించాలి అన్నారు. ఇక నుంచి, రాష్ట్రాన్ని, దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించడంలో తమ పాత్రను పోషించాలనీ, రాష్ట్ర మరియు దేశ పరిస్థితుల వర్తమానాన్ని, భవిష్యత్తును అంత తేలిగ్గా తీసుకోకూడదు అన్నారు.