ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగాలని చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో సమస్యలన్నీ పరిష్కారం కావాలని లక్ష్యంతో మండపేట నుంచి రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేస్తున్న వల్లూరు శ్రీవాణికి అమరావతి రైతులు స్వాగతం పలికారు. ఈ మేరకు సోమవారం విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఆమెకు స్వాగతం పలికి సత్కరించారు ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, అమరావతి మహిళలు, టీడీపి నాయకులు ఉన్నారు.