కురుపాంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు తహసీల్దార్ రమేష్ కుమార్ సోమవారం వెల్లడించారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచే పోలింగు సజావుగా ప్రారంభమయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పోలీంగ్ కేంద్రాల బయట టెంట్లు, మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 144 సెక్షన్ కూడ అమలు చేస్తున్నట్టు తెలిపారు.