ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలకు అనుమతి లేదు... జనసేనకు పోలీసుల ఝలక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2023, 07:46 PM

జనసేన పార్టీకి పోలీసులు ఝలక్ ఇచ్చారు. ఈ నెల 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో.. పోలీసులు కీలక ప్రకటన చేశారు. ర్యాలీలు, సభలపై పోలీసులు ఆంక్షలు విధించారు. జాతీయ రహదారిపై ర్యాలీలు, సభలకు అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌-30  అమల్లో ఉందని.. అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ఇటు మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఈ సభకు ప్రజలు సునామీలా వస్తారని జనసేన నేతలు ఆశిస్తున్నారు. ఇటు ఈ సభలో పవన్ కళ్యాణ్  కీలక రాజకీయ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అటు పోలీసుల ఆంక్షలపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తమ సభకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com