కంచిలి మండలం కంచిలి గ్రామానికి చెందిన గుడియా లింగరాజు అల్సర్ కారణంగా అస్వస్థకు గురయ్యాడు. వెంటనే స్థానికులు సిక్కోలు ఉద్దానం సేవా సమితి అందిస్తున్న అంబులెన్స్ సర్వీస్ ను మంగళవారం సంప్రదించగా తక్షణమే స్పందించి సంస్థ సభ్యులు 1వ నంబర్ అంబులెన్స్ ద్వారా శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు చేర్చారు. 2వ నెంబర్ అంబులెన్స్ టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, మెళియాపుట్టి ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంది.