ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి లారీ డ్రైవర్లకి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పెట్రోల్ డీజిల్ ధరలు పన్నులు తగ్గించాలని కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా జరిగే కార్మిక కర్షక మహాప్రదర్శనలో పాల్గొనాలని సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ మంగళవారం పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే బ్యాంకు ఇన్సూరెన్స్ రైల్వే ఆయిల్ బొగ్గు విమానాలు విశాఖ స్టీలు ప్లాంట్ వంటి ప్రభుత్వం ప్రైవేటుకరిస్తుంది కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాలో ఉన్న ఆయిల్ సెక్టార్లను కూడా అంబానీ ఆదానికి తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ నిక్షేపాలను ఓఎన్జేసీని కాదని అంబానీ ఆదానివంటే కార్పొరేటర్ కట్టబెడుతున్నారని దీని ఫలితంగా బాలు చేకూర్చే విధంగా ఆయిల్ ధరలు పెంచుతున్నారని ఫలితం గా లారీ మినీ లారీ ఆటో టాటా ఎ ఎస్ బస్ జీపు టాక్సీ, ట్రాక్టర్ లాంటి మెయింటెనెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లో ఏప్రిల్ 5 న మహాప్రదర్శన నిర్వహించటం జరుగుతుంది కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు .ఈ కార్యక్రమంలో జి కొండూరు మండల అధ్యక్షులు ఎస్ సుందరరావు హెచ్పీసీఎల్ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు సెక్రటరీ బాబురావు ,నాయకులు బుల్లి బాబు, భాస్కర్ ,రమేష్, సాంబశివరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.