గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరైన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పిటిసి ఏసీ పార్వతమ్మ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ సచివాలయం-3 పరిధిలోని 1వ వార్డులో జరుగుతున్న డ్రైనేజి నిర్మాణం పనులను ఎంపిపి, జెడ్పిటిసితో పాటు కో అప్షన్ సభ్యులు పామిడి సలీమ్, పార్టీ పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడు బసవరాజు, జేసిఎస్ పట్టణ అధ్యక్షుడు ఆసిఫ్, 1 వ వార్డు సభ్యులు శర్మస్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు మొమిన్ జిలాన్, సచివాలయ కన్వీనర్లు పామిడి షాహిదా, మద్దికెర అన్వర్, కొత్తపల్లి చంద్ర, వైస్సార్సీపీ నాయకులు యూసుఫ్, తయూబ్, బాలాజీ తదితరులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరవకొండలో నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనులకు ఐదు సచివాలయాలకు కలిపి ఇప్పటి వరకు కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయన్నారు. వీటిలో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని కొన్ని పూర్తి కాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఆయా వార్డుల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలిస్తున్నమని చెప్పారు. నియోజకవర్గ ఇంచార్జ్ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మండలాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామని వారు తెలిపారు.