ఓ మహిళా జడ్జిని బెదిరించిన కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఇస్లామాబాద్ డిస్ట్రిక్, సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నెల 29లోపు ఆయన్ను కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా జడ్జి పోలీసులను ఆదేశించారు. కాగా ఈసీ కార్యాలయంపై దాడి కేసులోనూ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.