ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 5 రాష్ట్రాలను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ కింద రూ.1,816 కోట్ల అదనపు సాయాన్ని అందించాలని కేంద్రం నిర్ణయించింది. అసోం, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఈ నిధులు కేటాయించగా.. అందులో ఒక్క కర్ణాటకకే రూ.941.04 కోట్లు కేటాయించింది. కాగా అదనపు సాయం ప్రకటించిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీ, దాని మిత్ర పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలే.