45 ఏళ్ల అహ్మదాబాద్ నివాసి గీతా రావు "అల్ట్రా సైక్లిస్ట్ "తల్లిపాల ప్రోత్సాహం నినాదం తో హైదరాబాద్ ధాత్రి సంస్థ సహకారం తో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారు 3700 కిలోమీటర్లు దూరం సైకిల్ యాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సైకిల్ యాత్రను మార్చి నెల 1వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సైకిల్ యాత్ర మంగళవారం కొడికొండ చెక్పోస్టులోని జాతీయ రహదారిపై వారిని ఈ సందర్భంగా జాతీయ రహదారిలోని కొడికొండ చెక్ పోస్ట్ కు చేరుకుంది. దింతో బి. పి. ఎన్. ఐ సంస్థ జాతీయ కార్యవర్గ సభ్యుడు, శ్రీ సత్యసాయి జిల్లా అఖిల భారత చిన్న పిల్ల సమాఖ్య అధ్యక్షుడు డా. కేశవులు ఆమెను కలిసి సన్మానం చేసి అభినందించారు.