కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం వివిధ పథకాలు ప్రవేశపెడుతోంది. ఈ పథకాల ద్వారా రైతులు ఏటా రూ. 42 వేలు పొందవచ్చు. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ అందరికీ తెలిసిందే. ఈ స్కీమ్‌లో చేరిన వారికి మోదీ సర్కార్ ఏటా రూ. 6 వేలు ఉచితంగా అందిస్తోంది. పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరడం ద్వారా రైతులకు ప్రతి నెలా రూ.3 వేలు లభిస్తాయి. అంటే ఏడాదికి రూ. 36 వేలు పొందొచ్చు.