వంటగ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్న వెల పుదుచ్చేరి ప్రజలకు పుదుచ్చేరి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.300 సబ్సిడీ ఇస్తామని రంగస్వామి ప్రభుత్వం ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ పథకం బడ్జెట్ రూ. 126 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి రంగస్వామి వెల్లడించారు.