తాడిపత్రి పట్టణం 14, 17 వార్డులలో మంగళవారం తాడిపత్రి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జెసి అస్మిత్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్ళి ప్రజల యోగక్షేమాలను, వారి స్థితిగతులను అడిగి తెలుసుకొన్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలను అడిగి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలంటూ మునిసిపల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి పట్టణ టీడీపీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు ప్రజలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.