ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖలో ఉండడంతోపాటు గన్‌మెన్‌ను వెంటబెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో హల్‌చల్ చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జునను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖే్‌షకుమార్ మీనా సోమవారం సాయంత్రమే ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు దీనిపై ప్రాథమికంగా విచారణ జరిపి కలెక్టర్‌కు విశాఖ పోలీసు కమిషనర్ నివేదిక సమర్పించినట్టు సమాచారం. మరోవైపు ఈ విచారణ నివేదికను బయటపెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ను జిల్లా విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశించారని, అదే నిబంధన సుబ్బారెడ్డి విషయంలో ఎందుకు అమలుచేయలేదని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa