తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (బుధవారం) శ్రీవారి దర్శనం భక్తులకు నేరుగానే కల్పిస్తున్నారు. నేడు టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం 63,285 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 22,487 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa