మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో తాను న్యాయం మాత్రమే కోరుతున్నానని.. రామోజీరావుకు శిక్ష పడాలని గానీ, ఆ సంస్థను మూసేయాలని గానీ కోరుకోవడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ... ఎంత పెద్దవాడైనా చట్టం ముందు తలవంచాల్సిందేనన్నారు. ఈ కేసు 17 ఏళ్లుగా నడుస్తోందని.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల సీఐడీ ఎంక్వయిరీ చేస్తోందని చెప్పారు. కోర్టులో కూడా కేసు ఉందన్నారు. తన వద్ద ఉన్న వివరాలన్నీ సీఐడీకి పంపిస్తానని తెలిపారు. కోర్టు ముందు కూడా వాదిస్తానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa