ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశ్నత్తరాల్లో కీలక ప్రశ్నలను అడగనున్న టీడీపీ సభ్యులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 01:00 PM

ఈరోజు అసెంబ్లీలో జరుగునున్న ప్రశ్నత్తరాల్లో కీలక ప్రశ్నలను టీడీపీ సభ్యులు అడుగనున్నారు. . రాష్ట్రంలో ప్రక్రుతి సేధ్యం ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలపై ప్రశ్నించనున్నారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ తీగలు తెగడంతో ప్రమాదాలు జరగుతున్న విషయం వాటి నిర్వహణ లోపాలపై టీడీపీ సభ్యులు ప్రశ్నించనున్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించిన మొత్తం ఎంత, వాటి పురోగతిపై ప్రశ్నించనున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు విద్యార్ధులు మల్లడం, పాఠశాలల్లో మొత్తం చదువుతున్న విద్యార్ధుల సంఖ్య, ప్రభుత్వం వారిని తిరిగి బడిలో చేర్పించడానికి తిరిగి తీసుకుంటున్న చర్యలపై టీడీపీ సభ్యులు ప్రశ్న వేయనున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు రాజకీయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారా అని తెలుగు దేశం సభ్యులు ప్రశ్నించనున్నారు. కర్నాటక నిర్మిస్తున్న ఎగువ భద్ర నీటి పారుదల ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రాంతం నీటి వనరులు ప్రభావితం అవుతుండడంపైనా ప్రభుత్వాన్ని టీడీపీ ప్రశ్నించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa