బెలూన్స్ అమ్ముకునే క్రిష్ అనే దివ్యాంగుడికి ఓ పాక్ మహిళ బిర్యానీ ప్యాకెట్లు అందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారులో వచ్చిన మహిళ బాలుడి వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీసి ఆహారం అందించింది. దీంతో ఆ బాలుడి ముఖం వెలిగిపోవడం మనం వీడియోలో చూడొచ్చు. అనంతరం అతని వద్ద కొన్ని బెలూన్స్ కూడా కొనుగోలు చేసింది. ఇదీ మానవత్వం అంటే అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa