జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డిని నెల్లూరు చింతా రెడ్డిపాలెం వారి నివాసంలో పలువురు ముస్లిం మైనార్టీ నేతలు బుధవారం మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆనం దంపతులకు శాలువా వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 34 వ డివిజన్ ముస్లిం మతపెద్దలు మరియు నాయకులు కంతర్ అలీ, ఇస్మాయిల్ ఖాదిరి, అహమద్ భాయ్, మీరా మొహిద్దీన్, కార్పొరేటర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa