ఏపీ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంపై పేపర్లు విసిరారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగలడంతో టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.