ఏపీ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను రూ.2,79,279 కోట్లుగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. వివిధ ప్రధాన పథకాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. జగనన్న విద్యాదీవెన-రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెన-రూ.2,200 కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుక-రూ.21,434.72 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా-రూ.4,020 కోట్లు, వైఎస్సార్-పీఎం బీమా యోజన-రూ.1,600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు-రూ.1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు.