మహారాష్ట్రలో రైతులు కదం తొక్కారు. 10 వేల మందికి పైగా కలిసి దాదాపు 200 కి.మీ లాంగ్ మార్చ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో రైతుల సమస్యలే పరిష్కారంగా దిండోరి నుంచి ముంబయి వరకూ ఈ పాదయాత్ర జరుగుతోంది. ఈ నెల 20న యాత్ర ముంబయికి చేరే అవకాశం ఉంది. నష్టపోయిన ఉల్లి రైతులకు క్వింటాల్ కు రూ.600 తక్షణ ఆర్థిక సాయం, 12 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.