నిన్న అసెంబ్లీ సమావేశాలకు కోటంరెడ్డి ప్లకార్డు పట్టుకుని పాదయాత్రగా వెళ్లారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలంటూ ఉదయం నుంచి సభలో నిలబడే నిరసన తెలిపారు. అయితే సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కోటంరెడ్డిని స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు కోటంరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం కోటంరెడ్డి కార్యాలయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. స్పీకర్ చైర్ ఏర్పాటు చేసి స్పీకర్గా షంషుద్దీన్ను కూర్చోపెట్టారు. అసెంబ్లీలో తాను ఏమి చెప్పదలుచుకున్నారో... ఆ అంశాల్ని మాక్ స్పీకర్ ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పారు.