ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రాఘవరెడ్డి తీహార్ జైలులో ఉన్నారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎంపీ మాగుంటకు కూడా తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఈడీ అరెస్ట్ చేసిన తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa