బుగ్గన ఆర్థిక శాఖా మంత్రిగా కంటే అప్పుల శాఖా మంత్రిగా పేరు తెచ్చుకున్నారని టీడీపీ నాయకులూ, నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేసిన 9 లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో చూపిన కేటాయింపులకు తగ్గట్టు ఖర్చులు లేకనే రైతులు పంటల విరామం ప్రకటిస్తున్నారన్నారు. మూడు రాజధానులకు మూడు ఇటుకలు కూడా పెట్టకుండా అమరావతిని అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.