ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక్కడి ఈ-మర్రిపాలెం రోడ్డులో హోమీబాబా కేన్సర్ ఆస్పత్రి సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏపీఐఐసీ మినీ ఆటోనగర్‌లోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్న బొబ్బరి అప్పలనాయుడు (30), పరవాడకు చెందిన జలుమూరి కృష్ణారావులు విధులు మగించుకుని ద్విచక్ర వాహనంపై ఇళ్లకు బయలుదేరారు. స్థానికంగా గల మలుపుల వద్దకు వచ్చేసరికి ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న గొన్న హేమచంద్నాయుడును ఢీకొన్నారు.
ఈ ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అప్పలనాయుడు మృతిచెందారు. ప్రస్తుతం హేమచంద్నాయుడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో, కృష్ణారావు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన హేమచంద్నాయుడు గొన్నా విద్యా సంస్థల కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మృతి చెందిన అప్పలనాయుడు స్వగ్రామం అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామం. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.