ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్య‌మంత్రి గారూ వెన‌క్కు వెళ్లిపోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 12:17 PM

‘గో బ్యాక్‌ సీఎం సార్‌’ అంటూ విశాఖపట్నంలో గురువారం ఫ్లెక్సీలు వెలిశాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌, వైస్‌ ఛాన్సలర్ల కార్యాలయాలకు వెళ్లే మార్గంలో వీటిని జన జాగరణ సమితి పేరుతో ఏర్పాటుచేశారు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వచ్చే జులై నుంచి విశాఖ నుంచి పరిపాలనా సాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం గమనార్హం. ‘ముఖ్యమంత్రి గారు వెనక్కి వెళ్లిపోండి. అమరావతిలోనే రాజధాని నిర్మించండి’ అంటూ ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. వీటిని చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలావుండగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అధికార పార్టీ వైసీపీ కార్యాలయంగా మార్చిన పాలకులు. ఈ ఫ్లెక్సీలతో కంగుతిన్నారు. నగరంలో ఎక్కడా కనిపించని ఈ ఫ్లెక్సీలు కేవలం ఏయూ దగ్గరే ఉండడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మూడో పట్టణ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా వున్న విద్యాలయంలో ఈ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయని, గుర్తుతెలియని వ్యక్తులు వీటిని తెల్లవారుజామున ఏర్పాటుచేసినట్టు తెలుస్తోందని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com