టీడీపీ అభ్యర్ధి చిరంజీవికి టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచీ విశాఖ స్వర్ణభారతి స్టేడియంలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ప్రతి రౌండ్లోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవి ఆధిక్యత కొనసాగిస్తున్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి 20వేలకు పైగా మెజార్టీ సాధించడంతో దాదాపు ఆయన విజయం ఖాయమైనట్టే. దీంతో విశాఖలో మళ్లీ పార్టీ పూర్వవైభవానికి ఈ ఎన్నిక దోహదపడుతుందని టీడీపీ భావిస్తోంది. ఈనేపథ్యంలో చంద్రబాబు కూడా మంచి ఖుషీగా ఉన్నారు. దీంతో శుక్రవారం చిరంజీవిక ఫోన్ చేసి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తరువాత నేరుగా వేపాడ చిరంజీవి చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది.