గాజువాక గణేష్ నగర్ కొండపై కొలువై ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం లో విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ గోవిందమాంబ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరణం రెడ్డి నరసింగారావు ప్రత్యేక ఆహ్వానితులుగా సిరసపల్లి నూకరాజు బాటా శ్రీనివాసరావు గుటూరు శంకర్రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకోటి శ్రీనివాసరావు మహిళా ప్రధాన కార్యదర్శి తిరుమల రాణి ఆలయ కమిటీ సభ్యులు గణపతి పంతం బ్రహ్మం మరియు మాత గోవింద మాంబ కార్యక్రమ నిర్వాహకులు కాకుమాను వెంకట వేణు, కంచర్ల గౌరీశంకరాచారి దంపతులుఇతర మహిళ భక్తులు, భక్తులు పాల్గొన్నారు.శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మరియు మాత గోవింద మంబా కు పట్టు వస్త్రములు సమర్పించి విశేష పూజలు జరిపారు.
ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్ణం రెడ్డి నరసింగరావు, శేషపల్లి నూకరాజు, బాటా శ్రీనివాసరావు గుంటూరు శంకర్రావు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.అనంతరం జరిగిన సభ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పీ. ఎం విశ్వకర్మ కౌశల్ యోజన రాబోయే తరంలో మా జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కొనియాడారు.
ముఖ్యఅతిథి కర్ణంరెడ్డి నరసిగ రావు మాట్లాడుతూ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞాన కర్త సుమారు 400 సంవత్సరంల క్రితమే ఆనాటి సామాజిక, సాంఘిక దురాచారాలపై పోరాటం చేసిన సంఘసంస్కర్త అయినటువంటి ధర్మపత్ని శ్రీ మాతా గోవింద మాంబ అమ్మవారు ఆరాధన మహోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం మనందరికీ శుభ పరిణామమే.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాస్ రావు ప్రధాన కార్యదర్శి గిడిజాల పార్వతీశం ఆచారి , ఉపాధ్యక్షులు శివప్రసాద్ , అప్పలరాజు, రాయల లక్ష్మణ్, పక్కి కొండబాబు, తిరుమల రాణి ఉపాధ్యక్షురాలు భవ్య పలువురు సంఘ నాయకులు, గాజువాక స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి గుంటపల్లి ప్రసాద్, సుంత్యన గణపతి పాల్గొన్నారు.