ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవి విజయం దాదాపు ఖరారైందని, సీఎం జగన్‌ను ఉత్తరాంధ్రఛీ కొట్టిందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. కౌంటింగ్ సరళిని ఆయన విశ్లేషించారు. ఈమేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రౌండ్‌లోనూ అధికార వైసీపీ అభ్యర్థి పోటీ ఇవ్వలేకపోయాడన్నారు. దీనిని బట్టి ఉత్తరాంధ్ర వాసులు ఏం కోరుకుంటున్నారో అర్థమవుతోందన్నారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి చిరంజీవి 20వేల ఆధిక్యంలో ఉన్నాడన్నారు. జగన్ ని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదన్నారు. రాజధాని కబుర్లు నమ్మలేదని అయ్యన్న పేర్కొన్నారు. రాజధాని పేరుతో జగన్ విశాఖలో చేసిన విధ్వంసం, అలాగే గడచిన 4 ఏళ్ళ చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరని గుర్తించారని అందుకే అందుకే ఈ వన్ సైడ్ ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ అంతానికి ఇది ఆరంభం మాత్రమేనన్నారు. సైకో పోవాలి - సైకిల్ రావాలి అని అయ్యన్న నినదించారు.