బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులతో ఇబ్బంది పెడుతున్న ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై. వై. సురేష్ శుక్రవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి, మండల పరిధిలోని వెల్లటూరు గ్రామానికి చెందిన 11 సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన పోతర్లంక రామారావు లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, మెరుగైన చికిత్స కోసం తెనాలి రిఫర్ చేసినట్లు తెలిపారు.