జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం గా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కడప వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మార్చి 18 వ తేదీన ఉదయం 10: 30 నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించ బడుతుందని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు ఎఫ్ఎసి చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ సియన్ మూర్తి, సెక్రటరీ ఎస్ కవిత లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ లో కుటుంబ తగదాలకు సంబంధించిన కేసులు, వినియోగదారుల కు సంబంధించిన కేసులను మాత్రమే రాజీ చేసుకోవచ్చును. మరింత సమాచారం కొరకు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్: 08562 258622, 244622.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa