ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజధాని వద్దని తేల్చి చెప్పారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 11:13 AM

ప్రశాంత వాతావరణం కోరుకునే విశాఖ ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజధాని వద్దని తేల్చి చెప్పినట్లయిందని వైసీపీ రెబల్ ఎంపీ   రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు బీజీపీని, విద్యావంతుడైన మాధవ్‌ను వద్దనుకొని టీడీపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ కట్టబెట్టడం వెనుక అధికార పార్టీని తుక్కుతుక్కుగా ఓడించాలనే లక్ష్యమే కనిపిస్తోందన్నారు. తూర్పు రాయలసీమ పరిధిలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ ను అయన అభినందించారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి పోరాటం చెయ్యవలసి వచ్చిందని అయన అభిప్రాయపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com