టర్కీ, సిరియాల్లో గతనెల భారీ భూకంపం సంభవించి దాదాపు 48 వేల మంది ప్రజలు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. గోక్సన్ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. కాగా, ఇటీవల ఆకస్మిక వరదల వల్ల సన్లీయుర్ఫా, అడియామన్ ప్రావిన్స్ లో 14 మంది మరణించారు. భూకంపం తర్వాత కూడా వరుస విషాదాలు జరుగుతుండడం బాధాకరం.