తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్య కొండకు భక్తులు ఇప్పుడు ప్రశాంతంగా ఆర్టీసీ సేవలు ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రైవేటు వాహనదారుల నిలువు దోపిడీకి మాత్రం కొందరు భక్తులు ఇంకా బలవుతున్నారు. ఇతర రాష్ట్రాల భక్తులకు మాయ మాటలు చెప్పి, మగ్గిపెట్టి పట్ట పగలు చుక్కలు చూపిస్తున్నారు. ఇంతటి ఘటనలు మల్లయ్య కొండ ప్రతిష్టను దిగజార్చే విధముగా జరుగుతుంటే ఆలయ అధికారులు ఎందుకు వాహనాలను నిషేధించట్లేదు.ఇంతటి దౌర్జన్యాలు జరుగుతున్న తంబళ్లపల్లి పోలీసులు ఎందుకు చోద్యం చూస్తున్నట్టు ఉండిపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు భక్తుల మదిలో మెదులుతున్నాయి. మరి రక్షించే నాధుడు లేడా , అడ్డుకునే దేవుడు రాడా. ఏదైతేనేం ఇప్పటికైనా పోలీసులు మేల్కొని ప్రైవేటు వాహనాలు కొండపైకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి భక్తులకు సేవలు మరింత సులభతరం చేయాలి, మల్లయ్య కొండ ప్రతిష్టను కాపాడాలని చర్యలు తీసుకోవాలని తంబాలపల్లి ప్రజలు వేడుకుంటున్నారు.