గుత్తి పోలీసు స్టేషన్లో అదనపు కట్నం వేదింపుల కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి పట్టణానికి చెందిన సంధ్య అనే మహిళకు రాయదుర్గం పట్టణానికి చెందిన మంజునాథ్ తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఐతే వివాహం జరిగినప్పటి నుంచి భర్త, ఆడ పడచులు వేధింపు లకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. దీంతో సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. బాధితు రాలు ఫిర్యాదు మేరకు భర్త మంజునాథ్, అత్త రుక్మిణి, మామ నాగరాజు, ఆడపడుచు వనిత, మరిది తిప్పేస్వామి, తోడి కోడలు రాధ, చిన్న మామ రమేష్ లపై 498- ఏ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.