కారు ఢీకొనడంతో ఇద్దరు రైతులు మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. లాహర్‌పూర్ కొత్వాలి ప్రాంతంలో ఓ ఆల్టో కారు ఇద్దరు రైతులపై నుంచి దూసుకెళ్లింది. దీంతో పొలంలో కాపలా కాస్తున్న రైతులు చనిపోయారు. ప్రమాదం అనంతరం కారు రోడ్డు పక్కన బోల్తా పడింది. కారు బోల్తా పడిన తర్వాత తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa