ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఫిష్ సిటీ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కొందరు వ్యక్తులకు మధ్య భూమి విషయంలో వివాదం జరిగింది. ఈక్రమంలో ప్రశ్నించిన మహిళపై వీధిలోనే రౌడీలు దాడికి పాల్పడ్డారు. కిందపడేసి కర్రలతో దారుణంగా కొట్టారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతుంది. దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa