నాడు నేడు ద్వారా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న సీఎం జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైట్ వాచ్ మెన్లను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5388 నాడు-నేడు స్కూళ్లకు నైట్ వాచ్ మెన్లను నియమించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో జారీ అయింది. ఈ వాచ్ మెన్లకు నెలకు రూ. 6 వేల గౌరవ భృతి ఇవ్వాలని జీవోలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa