మరణంలోనూ వీడని స్నేహ బంధం, ఘటనతో కన్నీరు మున్నీరవుతున్న కుటుంబసభ్యులు . వివరాల్లోకి వెళితే..శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం నూకనపల్లి గ్రామానికి చెందిన యలకచర్ల అరుణ్ (26) చెన్నైలోని ఓ సెల్‌ఫోన్ కంపెనీలో పనిచేస్తూ భార్యతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. కలువాయి మండలం నూకనపల్లి అరుంధతీయ కాలనీకి చెందిన యలకచర్ల చిన్న రేణుయ్య, అనంతమ్మల కుమారుడు అరుణ్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. 9 నెలలు క్రితం అరుణ్‌కు కలువాయి మండలం తెలుగురాయపురానికి చెందిన అనూషతో వివాహమైంది. ప్రస్తుతం అనూష గర్భవతిగా ఉంది. కాగా, ఐదేళ్లుగా అరుణ్ చైన్నైలోని ఓ సెల్‌ఫోన్ కంపెనీలో చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సొంత పనిమీద బైక్‌పై స్వగ్రామానికి వచ్చాడు. భార్యకు చెందిన మెడికల్ రిపోర్టులు తీసుకుని సాయంత్రం తిరుగు పయాణమయ్యాడు. ఆ సమయంలో ఉపాధి కోసం తన స్నేహితుడు దండు వెంకటరమణ (25) వస్తాననడటంతో ఇద్దరూ బైక్‌పై చెన్నైకు బయలుదేరారు.రాష్ట్ర సరిహద్దులో అర్ధరాత్రిపూట డివైడర్‌ను బైక్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa