విశాఖపట్నం సీబీఐ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్.వెంకటశ్రీరామ్‌శర్మ(55) ఆదివారం ఉదయం బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన్ను సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఉద్యోగరీత్యా విశాఖలో కుటుంబంతో నివాసముంటున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa