వైసీపీ ఎమ్మెల్యే కుమారుడికి అరుదైన గౌరవం దక్కింది. ఇదిలావుంటే చెన్నై వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడో వన్డే జరగనుంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇండియా, ఆసీస్ వన్డే మ్యాచ్ బీసీసీఐ పరిశీలకుడిగా నియమితులైనట్లు బీసీసీఐ ప్రకటించింది. నేడు చెన్నైలో జరిగే ఇండియా, ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ మ్యాచ్‌లో హర్షిత్‌రెడ్డి బీసీసీఐ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. ఆయన ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలబాలికల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు. ఇలాంటి గౌరవప్రదమైన నియామకాన్ని అందించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాదు విశాఖలో జరిగి భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌కు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ (Jiyyani Sridhar)కు ఏసీఏ కీలక బాధ్యతలు అప్పగించింది. విశాఖపట్నం విమానాశ్రయంలో ఇరు జట్ల ఆటగాళ్లకు స్వాగత ఏర్పాట్లను శ్రీధర్ పర్యవేక్షించారు. అలాగే విశాఖ మ్యాచ్ తెలుగు వ్యక్తి తోట విజయ్‌ను నియమించారు. విజయ్ ఇప్పటికి ఆయన తొమ్మిది వన్డేలు, నాలుగు టీ-20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు, 13 ఐపీఎల్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా సేవలందించారు. అలాగే 350కి పైగా పోటీలకు అంపైర్‌గా వ్యవరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa