ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానున్న రోజుల్లో రాజకీయాల్లో పెనుమార్పులు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 22, 2023, 01:04 PM

బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, మంగళూరు, హుబ్బళ్ళి - ధారవాడ, కలబురగి, మైసూరు, బీదర్‌ తదితర జిల్లాల్లో ప్రస్తుతం జామీనుపై ఉన్న మాజీ రౌడీలు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు తహతహలాడుతున్నారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంటు న్నాయి. వీరిలో కొందరు ప్రధాన రాజకీయ పార్టీలి టికెట్‌లకోసం దరఖాస్తు చేసుకున్నారని సమా చారం. ఇదే అంశంపై బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి స్పందిస్తూ రౌడీషీటర్ల విషయంలో పోలీసులు చట్టప్రకారమే వ్యవహరిస్తారని, ఎవరికీ మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. కాగా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక సమయంలో వారి నేప థ్యాన్ని సునిశితంగా పరిశీలించి టికెట్‌లు ఇవ్వాలని మేథావులు, సాహితీవేత్తలు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa