ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గోడ పత్రికలు ను అంటించిన కేసులో ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ అభ్యంతరకరమైన పోస్టర్లకు సంబంధించి దాదాపు 100 ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)లను నమోదు చేశారు. కొన్ని పోస్టర్లలో ‘‘మోదీని తప్పించండి, దేశాన్ని కాపాడండి’’ అని ఉంది. స్పెషల్ పోలీస్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ ఈ వివరాలను వెల్లడించారు. మోదీకి వ్యతిరేకంగా ఉన్న ఈ పోస్టర్లను అంటించినవారిపై ప్రింటింగ్ ప్రెస్ యాక్ట్, డిఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్‌ల ప్రకారం కేసులను నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ పోస్టర్ల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి వస్తున్న ఓ వ్యాన్‌ను తనిఖీ చేసినపుడు, అందులో ఇటువంటి పోస్టర్లను గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa