పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవ్యజోత్ కౌర్ కు క్యాన్సర్ సోకింది. దీంతో ఆమె జైలులో ఉన్న భర్తను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'మీరు చేయని నేరానికి జైలు పాలయ్యారు. జైలుకు వెళ్లేందుకు కారణమైన వారిని క్షమించండి. రోజూ మీ కోసమే ఎదురుచూస్తున్నా. నాకు స్టేజ్-2 క్యాన్సర్ అని తేలింది. మీకోసం ఇంకా ఎక్కువకాలం వేచి ఉండలేను' అని పోస్టు చేశారు.