అనుమానంతో భార్యను ముక్కలుగా నరికిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. బిష్ణుపుర్‌కు చెందిన అలీమ్ షేక్, ముంతాజ్‌కు 20 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈక్రమంలో ఉదయం పనికి వెళ్లిన ముంతాజ్ రాత్రి ఇంటికి రాలేదు. పోలీసుల విచారణలో భార్యను తానే చంపానని అలీమ్ ఒప్పుకున్నాడు. భార్యను హత్య చేసి ముక్కలుగా నరికాడు. అనంతరం దగ్గర్లోని ఓ చెరువు వద్ద వాటిని పాతిపెట్టాడని పోలీసులు తెలిపారు.