కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై పడ్డ అనర్హత వేటు నేపథ్యంలో దానికి గల కారణాలేమిటీ అన్నది ఆసక్తిగా మారింది. 2019లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటకలోని కోలార్ సభలో రాహుల్ గాంధీ చేసిన కీలక వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పరువు నష్టం దావా వేశారు. ఈ దావాపై విచారణ జరిపిన సూరత్ న్యాయస్థానం.. నాలుగేళ్ల పాటు విచారణ జరిపి.. గురువారం రోజున తీర్పు వెలువరించింది. అయితే.. ఈ తీర్పులో రాహుల్ గాంధీని దోషిగా పేర్కొంటూ.. రెండు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు కూడా ఇచ్చింది. కానీ.. ఈలోపే.. ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951 ప్రకారం.. రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది.