‘‘అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు, టిడ్కోలో, చివరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్మించే పనుల్లో కూడా గత చంద్రబాబు పాలనలో దోపిడీ జరిగింది. సబ్ కాంట్రాక్ట్‌ల పేరుతో బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించి మరీ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడీ ఇన్‌కంట్యాక్స్ రైడ్స్‌తో బయట పడిందని, అప్రైజల్ రిపోర్టులో షాపూర్‌జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్, చంద్రబాబు ఏపీ శ్రీనివాస్, రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు, మరికొంతమంది కలిసి ఒక పద్ధతి ప్రకారం దొంగల ముఠాగా ఏర్పడి.. దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమంలో భాగస్వాములై ఏరకంగా లూటీ చేశారో ఆధారాలతో సహా దొరికిపోయారన్నారు. ఇవన్నీ శాసనసభ ద్వారా ప్రజలందరికీ, ఎమ్మెల్యేలందరికీ తెలియాలని చెబుతున్నామని సీఎం వైయస్ జగన్ అన్నారు.