ఈ ఏడాది 2900 దేవాలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, హిందూ ధర్మ ప్రచారం, రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ ఏడాది ధూపదీప నైవేద్యాల కింద రూ.27.47 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన బిల్లులు కూడా వారం పది రోజుల్లో క్లియర్ చేస్తాం. అర్చకులకు సంబంధించి ఇంకా 8600 దేవాలయాలు ఉన్నాయి. వారికి కూడా అందించాలని సభ్యులు కోరుతున్నారు. ఇవే కాకుండా కొత్తగా నిర్మించే దేవాలయాల్లో కూడా సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. దేవాలయానికి సంబంధం ఉన్న ప్రతి కమిటీలకు ప్రతి ఏటా రూ.15 కోట్లు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.