తిరువూరు నియోజకవర్గము గంపలగూడెం మండలం పెనుగొలను మెయిన్ ప్రాథమిక పాఠశాలలో శనివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి, వ్యాకరణ వేత్త దువ్వూరి వేంకటరమణ శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్. మధుసూదన్ రావు మాట్లాడుతూ.. వీరు రచించిన వ్యాకరణ శాస్త్రానికి సంబంధించిన "రమణీయం" గ్రంథం విశ్వ విద్యాలయాల స్థాయిలో చిరస్మరణీయం గా నిలిచిందని కొనియాడారు. పాఠశాల విద్యార్థులకు సాయిబాబా సేవా కమిటీ సభ్యులు నోట్ పుస్తకాలు, పెన్సిల్లు, స్కేలు, రబ్బర్లు, చెక్ మరలు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు చావా రమ , అంగన్వాడీ టీచర్ స్వరూప రాణి, సాయిబాబా యూత్ కమిటీ కన్వీనర్ వూటుకూరు యజ్ఞకృష్ణ, సంగెపుశేషగి, రిరాధమ్మ, దివ్య, సీతమ్మ, సరోజిని, రమ్య, తదితరులు పాల్గొన్నారు.